అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Moto Signature | ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా (Motorola) కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. మోటో సిగ్నేచర్‌ను శుక్రవారం భారత్‌లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) అందుబాటులో ఉండనుంది. ఈనెల 30 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్ప్లే : 6.8 అంగుళాల సూపర్ హెచ్డీ ఎల్టీపీవో ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్ప్లే అమర్చారు. 165 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు, 6200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ చేస్తుంది. ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది. మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తాయి.
సాఫ్ట్వేర్ : ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటోరొలా హెలోయూఐ ఓఎస్‌తో వస్తోంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జన్5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఏడేళ్లపాటు సెక్యూరిటీ, ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
కెమెరా సెటప్ : వెనక వైపు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 50 ఎంపీ పెరిస్కోప్ సెన్సార్ అమర్చారు. ఈ సెటప్ 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100 ఎక్స్ హైబ్రిడ్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్కోసం ముందువైపు 50 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌తో 8k/30FPSతో వీడియోలు రికార్డు చేయొచ్చు.
బ్యాటరీ సామర్థ్యం : 5,200 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90W ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
12జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ. 59,999.
16జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ. 64,999
16జీబీ+ 1టీబీ వేరియంట్ రూ. 69,999.
కార్డ్ ఆఫర్లు : హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.