అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Zealand ODI Series | భారత్ – న్యూజిలాండ్ వన్డే సిరీస్ త్వరలో జరుగనుంది. కాగా.. ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. స్క్వాడ్‌కు యువ స్టార్ ప్లేయర్ శుభ్ మాన్ గిల్ (Shubman Gill)ను నియమించింది. ఇక గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)కి స్థానం కల్పించింది. అలాగే రిషబ్ పంత్‌ను కూడా సెలెక్ట్ చేసింది.
New Zealand ODI Series | వారికి విశ్రాంతి..
వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చింది. అలాగే మహమ్మద్ షమీ పేరు వినిపించినా.. సెలక్టర్లు సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కే ఛాన్స్ కల్పించారు.
New Zealand ODI Series | యంగ్ ప్లేయర్లకు ఛాన్స్
బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్‌లో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ దక్కింది. యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లతో జట్టు స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 11న వడోదరలో జరుగనుంది. అలాగే సెకండ్ మ్యాచ్ జనవరి 14న రాజ్‌కోట్‌లో, చివరి మ్యాచ్ జనవరి 18న ఇండోర్‌లో జరుగుతుంది.
New Zealand ODI Series | భారత వన్డే జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)గా ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ ఉన్నారు.