అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyber Fraud | సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని నమ్మించి చాలా మందిని మోసం చేస్తున్నారు. ఈజీ మనీ(Easy Money) కోసం చూసేవారు వీరి మోసాలకు ఎక్కువగా బలవుతున్నారు. అలాగే ఉద్యోగాల కోసం అన్వేషించే వారిని సైతం సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తాజాగా ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు చెందిన మహిళ దగ్గర రూ. 1.27 లక్షలు కాజేశారు.
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్ యాప్‌లో ఓ లింక్ కనిపించింది. గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో పెట్టుబడి పెట్టి రోజు రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఉంది. దీంతో ఆమె నమ్మి వారికి ఫోన్ చేసింది. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మొదట పెట్టుబడి పెట్టాలని నమ్మించాడు. దీంతో బాధితురాలు రూ.1.27 లక్షలు వారు చెప్పిన ఖాతాలో జమ చేసింది. అయితే ఎటువంటి ఆదాయం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.