అక్షరటుడే, వెబ్‌డెస్క్: Union Budget 2026 | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో (Finance Minister Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇది యువశక్తి బడ్జెట్(Youth Power Budget) అని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టారు. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్(Union Budget) సభలో ప్రవేశ పెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది ఒక ప్రత్యేకమైన యువశక్తి ఆధారిత బడ్జెట్ అని పేర్కొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలపై దృష్టి పెట్టడమే ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. దీనిని సాధించడానికి, ప్రభుత్వం మూడు కర్తవ్యాల ద్వారా ప్రేరణ పొందిందన్నారు.
Union Budget 2026 | మూడు కర్తవ్యాలు
మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా కేంద్రం మంత్రి ప్రకటించారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి(economic growth), వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ (Sab ka saath, sab ka vikaas) సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం అనే కర్తవ్యాలను ప్రకటించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలతో సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచ మార్కెట్లతో లోతుగా అనుసంధానం కావాలని, ఎగుమతులు పెరగాలని, స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించాలన్నారు.
Union Budget 2026 | స్టార్టప్‌లకు ప్రోత్సాహం
యువ శక్తి బడ్జెట్‌గా రూపకల్పన చేశామన్నారు. కొత్త ఆలోచనలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగ కల్పన కోసం యువతకు ప్రోత్సహం దిశగా బడ్జెట్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిలకడ వచ్చిందని చెప్పారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉందన్నారు. జనవరిలో 1.93 లక్షల కోట్లు జీసీఎస్టీ వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. కాగా భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం నాడు ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.