HomeసినిమాIMDb Rankings | నెటిజెన్లు అత్యధికంగా సెర్చ్​ చేసింది ఈ హీరోయిన్​ గురించే..

IMDb Rankings | నెటిజెన్లు అత్యధికంగా సెర్చ్​ చేసింది ఈ హీరోయిన్​ గురించే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IMDb Rankings | భారత సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం ఉంటుంది. పారితోషికం నుంచి మొదలు పెడితే అన్ని విషయాల్లో వారే డామినేట్​ చేస్తారు. అభిమానులు కూడా వారికే అధికంగా ఉంటారు. అయితే గత పదేళ్లలో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్​ చేసిన జాబితాలో మాత్రం బాలీవుడ్​ బామ దీపికా పదుకొనే (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచారు.

దేశంలో భారత సినిమాలపై IMDb పరిశోధనలు చేస్తోంది. 2000-2025 వరకు భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన ప్రముఖులు, చిత్రాలపై ర్యాంకులు విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా 2014 జనవరి నుంచి 2024 ఏప్రిల్​ వరకు అత్యధికంగా నెటిజెన్లు సెర్చ్​ చేసిన జాబాతాను IMDb తాజాగా రిలీజ్​ చేసింది. ఇందులో అగ్ర హీరోలను కాదని దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచారు.

IMDb Rankings | రెండోస్థానంలో షారుక్​ఖాన్​

ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించినట్లు IMDb తెలిపింది. దీపికా పదుకొనే టాప్​లో ఉండగా.. షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. మరో ఇద్దరు హీరోయిన్లు ఐశ్వర్య రాయ్ (3వ స్థానం), అలియా భట్ (4) టాప్​ 5లో ఉండటం గమనార్మం. ఐదో స్థానంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు. అమీర్ ఖాన్ (6), సల్మాన్ ఖాన్ (8), హృతిక్ రోషన్ (9), మరియు అక్షయ్ కుమార్ (10) వంటి అగ్ర బాలీవుడ్ (Bolluwood) తారలు అందరూ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.

IMDb Rankings | దక్షిణాది నుంచి ఎవరంటే..

ఈ జాబితాలో దక్షిణాది నుంచి ఎవరు కూడా టాప్​ 10లో చోటు దక్కించుకోలేక పోయారు. కానీ హీరోయిన్​​ సమంత 13వ స్థానంలో నిలిచారు. తమన్న 16, నయనతార 18, ప్రభాస్​ 29, ధనుష్​ 30 స్థానాల్లో నిలిచారు. తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas)​ ఒక్కరే టాప్​ 30లో ఉండటం గమనార్హం.

IMDb Rankings | స్పందించిన దీపిక

జాబితాలో తన స్థానం గురించి దీపిక స్పందించారు. “నేను నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఒక స్త్రీ తన కెరీర్‌లో విజయం సాధించడానికి ఎలా నావిగేట్ చేయాలో నాకు తరచుగా చెప్పేవారు. అయితే మొదటి నుంచి నేను ప్రశ్నలు అడగడానికి, మరింత కష్టతరమైన మార్గంలో నడవడానికి భయపడలేదు.” అని పేర్కొన్నారు. తన కుటుంబం, అభిమానుల సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు.

IMDb Rankings | దీపిక రాబోయే సినిమాలు

దీపిక ఇటీవల కల్కీ –2 నుంచి తప్పుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమె సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది, ఆ స్థానంలో త్రిప్తి దిమ్రీ నటిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో దీపిక ఈ సీక్వెల్ లో భాగం కాదని కల్కి 2898 AD నిర్మాతలు ప్రకటించారు. ప్రభాస్ మరియు అమితాబ్ బచ్చన్​లతో పాటు 2024 బ్లాక్ బస్టర్లలో ఆమె ముఖ్య పాత్ర పోషించింది. కాగా ఆమె అల్లు అర్జున్ సరసన అట్లీతో కలిసి రాబోయే ‘AA22xA6’ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత ఆమె సిద్ధార్థ్ ఆనంద్ కింగ్​లో షారుఖ్ ఖాన్​తో జత కట్టనుంది.