అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chitrangada Singh | సినీ ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా సాధారణం. హీరోలు, హీరోయిన్లు కొందరు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం వరుస ఫ్లాప్స్ వస్తే ఒక్కసారిగా కనుమరుగైపోతారు.
ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో సినిమా ఫ్లాప్ అయితే చాలు ‘ఐరన్ లెగ్’ అనే ట్యాగ్ వేసి అవకాశాలు తగ్గించడం ఇండస్ట్రీలో తరచూ కనిపించే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక హీరోయిన్ మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గంలో సాగుతోంది. దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో (Film Industry) ఉన్నా ఒక్క భారీ హిట్ కూడా ఆమె ఖాతాలో లేకపోయినా, ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
Chitrangada Singh | 2005లో ఎంట్రీ.. ఇప్పటివరకు హిట్ కోసం ఎదురుచూపే
అందం, గ్లామర్, స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అదృష్టం మాత్రం కలిసి రాకపోయినా, తన ఉనికిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు… బాలీవుడ్ ముద్దుగుమ్మ చిత్రాంగదా సింగ్ . 2005లో విడుదలైన ‘హజారోన్ ఖ్వైషీన్ ఐసీ’ (Hazaaron Khwaishein Aisi )అనే క్రైమ్ డ్రామా చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా మారిన ఆమె, తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, కమర్షియల్‌గా మాత్రం పెద్ద హిట్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా, బాక్సాఫీస్ పరంగా ఆమెకు నిలకడైన విజయం దక్కలేదు.
నటిగానే కాదు, నిర్మాతగా కూడా తన ప్రతిభను చూపింది చిత్రాంగదా సింగ్. 2018లో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మా’ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరించింది. ఇటీవలే ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. చిత్రాంగదా సింగ్ సినీ కెరీర్లో తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండడం ఆమె ప్రయాణాన్ని మరింత క్లిష్టం చేసింది. ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఎన్నో బ్లాక్‌బస్టర్ అవకాశాలు చేజారిపోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందిస్తూ, తన కెరీర్లో ఎన్నో తప్పులు చేశానని చెప్పింది. నేను చాలా పెద్ద సినిమాలను మిస్ చేసుకున్నాను. గ్యాంగ్‌స్టర్ సినిమాను (Gangster Movie) రిజెక్ట్ చేశాను. అలాగే తను వెడ్స్ మను కూడా నా చేతులారా వదులుకున్నాను. మంగల్ పాండే సినిమాలో అమీషా పటేల్ చేసిన పాత్రను కూడా నేను రిజెక్ట్ చేశాను’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అవకాశాలు మిస్ అయినా, వరుస హిట్స్ లేకపోయినా చిత్రాంగదా సింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందం, గ్లామర్, స్టైల్‌తో ఇప్పటికీ సోషల్ మీడియాలో, ఈవెంట్స్‌లో ఆమె హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇది ఆమె వ్యక్తిత్వానికి, స్క్రీన్ ప్రెజెన్స్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.