అక్షరటుడే, వెబ్డెస్క్: Anmol Bull | సాధారణంగా గేదేలు, దున్నపోతులు వేలు, లక్షల రూపాయలకు అమ్ముడు పోతుంటాయి. అయితే ఈ దున్నపోతు (buffalo) మాత్రం ఏకంగా రూ.23 కోట్లు రేటు పలికింది. దాని విశేషాలు చూద్దాం.
హరియాణాకు చెందిన అన్మోల్ బుల్ రాజస్థాన్‌లోని (Rajasthan) చారిత్రక పుష్కర్ పశువుల సంతలో ఆకర్షణగా నిలిచింది. అన్మోల్ (Anmol Buffalo) పేరుగల దున్నపోతు 1500 కిలోల బరువు ఉంది. దీని రేటు రూ.23 కోట్లుగా దాని యజమాని నిర్ణయించారు. బలిష్టంగా ఉన్న ఆ దున్నపోతును ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
Anmol Bull | నెలకు రూ.5 లక్షల ఆదాయం.
ఈ దున్నపోతు భారీ ధర పలకడానికి ప్రధాన కారణం దీని వీర్యానికి ఉన్న డిమాండ్. ఉత్తమ జాతి పశువులను వృద్ధి చేయడానికి, దేశీయ పశు సంపదను పెంపొందించడానికి దీని వీర్యాన్ని ఉపయోగిస్తున్నారు. దీని యజమాని అన్మోల్ బుల్ ద్వారా వారానికి రెండు సార్లు వీర్యం సేకరిస్తారు. దానిని విక్రయించి నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తాడు. దీంతోనే దానికి అంత రేటు పలికింది. అయితే దున్నపోతుకు బాదం, కాజు, యాపిల్స్, క్యారెట్ వంటి పౌష్టికాహారాన్ని (nutritious food) అందిస్తారు. దీని నిర్వాహణకు నెలకు రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు యజమాని తెలిపారు.
Anmol Bull | ఏటా పుష్కర్ మేళా
రాజస్థాన్లో ఏటా పుష్కర్ మేళా (Pushkar Mela) నిర్వహిస్తారు. ఈ మేళాలో దేశంలోని అనేక రకాల జంతువులను ప్రదర్శిస్తారు. అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 5 వరకు ఈ మేళా సాగుతుంది. ఈ సారి మేళాలో అన్మోల్ బుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా దాని వయసు 8 ఏళ్ల కాగా.. హర్యానాలోని సిర్సా జిల్లా నుంచి వచ్చింది.
