అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిసింది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ సైతం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 279 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ మీటింగ్ తీర్మానాల ప్రకటనకు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండడంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వాటి ప్రభావం మన మార్కెట్‌పైనా కనిపిస్తోంది. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, రూపాయిలో బలహీనత, ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం వంటి కారణాలతో రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. దీంతో స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
ఫ్లాట్‌గా ప్రారంభమై..
ప్రధాన సూచీలు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 59 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 413 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో సెన్సెక్స్ క్రమంగా బలహీనపడుతూ 707 పాయింట్లు పడిపపోయింది. నిఫ్టీ( Nifty) 25 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై వెంటనే 32 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో 115 పాయింట్లు లాభపడిరది. అక్కడినుంచి 213 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 279 పాయింట్ల నష్టంతో 84,387 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 25,755 వద్ద స్థిరపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,898 కంపెనీలు లాభపడగా 2,289 స్టాక్స్ నష్టపోయాయి. 150 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 74 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 136 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
మెటల్, ఎనర్జీ మినహా..
మెటల్, ఎనర్జీ సెక్టార్లు మినహా మిగిలిన సెక్టార్ల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈలో మెటల్ 0.52 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.21 శాతం పెరిగాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్, సర్వీసెస్ ఇండెక్స్‌లు 1.18 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.99 శాతం, ఐటీ ఇండెక్స్ 0.94 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.82 శాతం, ఇండస్ట్రియల్ 0.76 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.08 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం నష్టంతో ముగిశాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 0.87 శాతం, సన్‌ఫార్మా 0.75 శాతం, ఐటీసీ 0.55 శాతం, ఎన్టీపీసీ 0.48 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.38 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎటర్నల్ 30.3 శాతం, ట్రెంట్ 1.79 శాతం, ఎయిర్టెల్ 1.10 శాతం, ఇన్ఫోసిస్ 0.90 శాతం, టెక్ మహీంద్రా 0.84 శాతం నష్టపోయాయి.