అక్షరటుడే, ఎల్లారెడ్డి: Thimmapur Uma Sangameshwara Swamy | ఎల్లారెడ్డి (Yellareddy) మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయం (Uma Sangameshwara Swamy Temple ) ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు.
Thimmapur Uma Sangameshwara Swamy | తెల్లవారుజామున కనుల పండువగా..
ఆలయంలో బుధవారం తెల్లవారుజామున భక్తజనం నడుమ రథోత్సవం కనులపండువగా సాగింది. కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు రథానికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథంపై ఉత్సవమూర్తులను ఉంచారు. అనంతరం గుమ్మడికాయలతో దిష్టితీసి, వారుపోసి, కాయాకర్పూరం సమర్పించారు.
హరహర మహాదేవ.. శంభోశంకర..
హరహర మహదేవ.. శంభోశంకర.. నమశ్శివాయ నామస్మరణతో భక్తజనం రథాన్ని లాగగా యాత్ర ముందుకు సాగింది. స్వామిని గౌరీశంకరులుగా అలంకరించి స్వాములు వేదమంత్రాలు చదువుతూ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, పురుషులు పోటీపడి రథాన్ని లాగారు. తిమ్మాపూర్ (Timmapur) నుంచి సంగమేశ్వర కొండ ప్రాంతం వరకు రథోత్సవం సాగింది. అనంతరం హారతి అందుకొని భక్తులు ప్రసాదం స్వీకరించారు. రథోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్థులు, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.