అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ చెరువు కట్ట మళ్లీ కొట్టుకుపోయింది. రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) వరద ఉధృతంగా రావడంతో తాత్కాలికంగా నిర్మించిన చెరువు కట్ట తెగిపోయింది.
ఆగస్టు 28న భారీ వర్షాలకు వచ్చిన వార్తకు చెరువుకట్ట పూర్తిగా ధ్వంసమైంది. ఆ చెరువు కింద ఉన్న పొలాలను సంరక్షించేందుకు ఇసుక బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. పంటలకు సరిపడా నీరు నిల్వ ఉండేలా మరమ్మతులుచేశారు.
అయితే ఆదివారం కురిసిన వర్షానికి అటవీ ప్రాంతాల నుంచి భారీ వరదరావడంతో ఇసుక బస్తాలను కొట్టుకుపోయాయి. చెరువు కట్ట తెగిపోవడంతో తిమ్మాపూర్ (Thimmapur) గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరమ్మతులు చేపట్టినప్పటికీ కురుస్తున్న వర్షాలకు కట్టతెగిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. చెరువుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానిక రైతులు(Farmers), ప్రజలు కోరుతున్నారు.