అక్షరటుడే, బోధన్: Hunsa | సాలూర మండలం హున్సా ప్రభుత్వ పాఠశాలలో (Hunsa Government School) చోరీ జరిగింది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పాఠశాలలో రికార్డు రూం తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అయితే బీరువాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా అవి తెరుచుకోలేదు. పాఠశాలలో చోరీ జరిగిన వస్తువుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పాఠశాల ఉపాధ్యాయులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో bodhan rural police station ఫిర్యాదు చేయనున్నారు.