Homeఆంధప్రదేశ్IRS Officer | ఐఆర్​ఎస్​ అధికారి బ్యాగ్​ ఎత్తుకెళ్లిన దొంగలు

IRS Officer | ఐఆర్​ఎస్​ అధికారి బ్యాగ్​ ఎత్తుకెళ్లిన దొంగలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IRS Officer | దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఐఆర్​ఎస్​ అధికారి(IRS Officer) బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ(Telangana)కు చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి హాజరయ్యారు. చెంచుపేటలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం రాత్రి ఈ వేడుక జరిగింది. కారులో వివాహానికి వెళ్లిన ఆయన బయట పార్క్​ చేసి లోనికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి కారు పగిలి ఉండటాన్ని గమనించారు. కాగా కారు డోర్​ తీసి చూడగా బ్యాగ్​ కనిపించలేదు.

దొంగలు కారు అద్దం పగులకొట్టి బ్యాగ్​ ఎత్తుకెళ్లారు. అందులో రూ.5లక్షల నగదు, రూ.10లక్షల విలువైన బంగారం, 3 ఐఫోన్‌లు, పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌ కార్డులు ఉన్నట్లు సదరు అధికారి తెలిపారు. ఈ మేరకు తెనాలి(Tenali) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మూడో టౌన్​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి యత్నిస్తున్నారు.

IRS Officer | పెరిగిన చోరీలు

ఇటీవల దొంగతనాలు పెరిగాయి. కొంతమంది యువకులు తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలని దొంగతనాల బాట పడుతున్నారు. వ్యసనాలకు బానిసలుగా మారి చోరీలు చేస్తున్నారు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాహనాల్లో విలువైన వస్తువులు ఉంటే చోరీలు చేస్తున్నారు. అలాగే చైన్​ స్నాచింగ్​లకు సైతం పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులను వాహనాల్లో పెట్టి వెళ్లొద్దని, ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సైతం బంగారం, ఇతర విలువైన వస్తువులు బ్యాంక్​ లాకర్లలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.