అక్షరటుడే, వెబ్డెస్క్ : SBI ATM | ఏటీఎంలో చోరీ చేయడమే కాకుండా నిప్పు పెట్టి పారిపోయారు దుండగులు. ఈ ఘటన సూర్యాపేట(Suryapeta) జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ (Huzur Nagar)లోని లింగగిరి రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం (sbi atm)లో రాత్రి చోరీ జరిగింది. కారులో వచ్చిన దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని రూ.20 లక్షలు ఎత్తుకెళ్లారు. అనంతరం ఏటీఎంకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
