అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు ఉద్యోగుల ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Kamareddy | ఇంట్లోకి చొరబడి..
కామారెడ్డి పట్టణంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో పట్టపగలు చోరీ (robbery) జరిగింది. ఈ ఘటనలో 5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధిత కుటుంబాలు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో వైద్యశాఖలో పనిచేసే బాలునాయక్, గర్గుల్ గ్రామంలో పంచాయతీ సెక్రెటరీగా పనిచేస్తున్న శోభ దంపతులు నివాసం ఉంటున్నారు. ఉదయమే ఇద్దరు విధులకు వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం శోభ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఆమె కంగారుపడి ఇంట్లోకి వెళ్లి చూడగా.. దుండగులు ఆమెను చూసి డోర్ వెనుక గుండా పారిపోయారు. వెంటనే భయంతో శోభ తన భర్తకు ఫోన్ చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఇంట్లో..
కామారెడ్డిలోని అదే కాలనీలో గల మరో (Nizamabad) ఇంట్లోనూ దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిజామాబాద్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వెన్నెల ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ రెండు చోరీలలో పంచాయతీ సెక్రెటరీ ఇంట్లో 5 తులాల బంగారంతో పాటు నగదు, వెన్నెల ఇంట్లో 30 తులాల వెండి, రూ.50 వేల నగదు దుండగులు దోచుకెళ్లినట్టుగా బాధితులు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
