Bhiknoor
Bhiknoor | రెడీమిక్స్​ ప్లాంట్​లో దొంగల హల్​చల్​.. నైట్​వాచ్​మెన్లపై దాడి

అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | భిక్కనూరు శివారులో ఉన్న రెడీమిక్స్​ ప్లాంట్​లో (Readymix Plant) దొంగలు హల్​చల్​ చేశారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు టోల్​ప్లాజా సమీపంలో రెడీమిక్స్​ ప్లాంట్​ ఉంది. టోల్​ప్లాజా భవనాల నిర్మాణాల నిమిత్తం రెడీమిక్స్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయగా ఈ ప్లాంట్​కు ఇద్దరు వ్యక్తులు నైట్​వాచ్​మెన్లుగా ఉన్నారు.

Bhiknoor | పైప్​లు దొంగలిస్తూ..

తెల్లవారుజామున దుండగులు ఆటోలో వచ్చి అక్కడి పైప్​లు దొంగలిస్తుండగా నైట్​ వాచ్​మెన్లు (Night watchmen) అడ్డుకున్నారు. దీంతో వారిపై దుండగులు దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.