అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలో దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేస్తున్నారు. ముఠాలుగా ఏర్పడిన దుండగులు ఉదయం వేళల్లో రెక్కీ నిర్వహిస్తూ రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నారు. ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలోని మమ్మదీయ కాలనీలో దుండగులు ఇంట్లోకి చొరబడి నగలు అపహరించుకుపోయారు.
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ షకీర్ కుటుంబం మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. ఇళ్లంతా గందరగోళంగా ఉండడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదో టౌన్ ఎస్హెచ్ఓ గంగాధర్ చోరీ జరిగిన ఇంటి పరిసరాలను పరిశీలించారు.
ఒకటిన్నర బంగారం కనబడడం లేదని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.