Homeఆంధప్రదేశ్Srikakulam | హెడ్​ కానిస్టేబుల్ బైక్​ ఎత్తుకెళ్లిన దొంగ

Srikakulam | హెడ్​ కానిస్టేబుల్ బైక్​ ఎత్తుకెళ్లిన దొంగ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్​ స్టేషన్​లో చోరీ జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా హెడ్​ కానిస్టేబుల్ బైక్​ ఎత్తుకెళ్లాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Srikakulam | ఓ దొంగ ఏకంగా హెడ్​ కానిస్టేబుల్​ బైక్​ను ఎత్తుకెళ్లాడు. అది కూడా పోలీస్​ స్టేషన్ నుంచి చోరీ చేయడం గమనార్హం. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్​లో (Andhra Pradesh) చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్​ స్టేషన్​ (Narasannapet police station) పరిధిలో ఇటీవల చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్​ స్టేషన్​కు తీసుకు వచ్చారు. ఆ సమయంలో అదును చూసిన సదరు వ్యక్తి హెడ్​ కానిస్టేబుల్​ బైక్​పై పరారయ్యాడు. దీంతో పోలీసులు షాక్​ అయ్యారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కాగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ నిందితుడు పోలీస్​ స్టేషన్​ నుంచి హెడ్​ కానిస్టేబుల్​ బైక్​(head constable bike)తో పరార్​ అవుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Must Read
Related News