HomeజాతీయంRahul Gandhi | ఓట్ల కోసం ఏ డ్రామా అయినా చేస్తారు.. ప్రధానిపై రాహుల్ ఫైర్

Rahul Gandhi | ఓట్ల కోసం ఏ డ్రామా అయినా చేస్తారు.. ప్రధానిపై రాహుల్ ఫైర్

ప్రధానమంత్రి మోదీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ జీ ఓట్ల కోసం ఏదైనా డ్రామా చేయవచ్చని, ఆయనకు మీ ఓటు మాత్రమే కావాలని పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం మరోసారి నిప్పులు చెరిగారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ముజఫర్పూర్ నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎన్నికల్లో గెలవడానికి “ఏ డ్రామా” అయినా చేయగలరని ఆరోపించారు. “మోదీ జీ ఓట్ల కోసం ఏదైనా డ్రామా చేయవచ్చు. ఆయనకు మీ ఓటు మాత్రమే కావాలి. మీరు నరేంద్ర మోడీని డ్యాన్స్ చేయమని చెబితే. ఆయన డ్యాన్స్ కూడాచేస్తారని” వ్యంగ్యంగా అన్నారు.

Rahul Gandhi | ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు..

ప్రధాని మోదీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని రాహుల్ (Rahul Gandhi) మరోసారి పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఓట్లను దొంగిలించిందన్నారు. మోదీకి ఛత్ పూజ, యమునా నదితో సంబంధం లేదన్నారు.“అక్కడ యమునా లేదు. అక్కడ ఒక చెరువు ఉంది. నరేంద్ర మోదీ తన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి వెళ్లాడు. ఆయనకు యమునా నదితో సంబంధం లేదు. ఆయనకు ఛత్ పూజతోనూ సంబంధం లేదు. ఆయనకు మీ ఓటు మాత్రమే కావాలి. మీరు నరేంద్ర మోదీని నృత్యం చేయమని చెబితే ఆయన నృత్యం చేస్తారు.. వారు (బీజేపీ) మీ ఓట్లను దొంగిలించడంలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వారు ఈ ఎన్నికల ప్రక్రియను అంతం చేయాలనుకుంటున్నారు. వారు మహారాష్ట్ర (Maharashtra)లో ఎన్నికలను దొంగిలించారు, హర్యానాలో ఓట్ల చోరీకి పాల్పడ్డారు. ఇప్పుడు బీహార్ లోనూ తమ వంతు ప్రయత్నం చేస్తారని” అని రాహుల్ విమర్శించారు.

Rahul Gandhi | జీఎస్టీతో చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు.

ప్రధాని మోదీ జీఎస్టీ అమలు చేయడం ద్వారా చిన్న వ్యాపారాలను సర్వనాశనం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మేకిన్ ఇండియా (Make in India) అని మోదీ చెబుతుంటే, మరోవైపు, భారతదేశంలో అమ్ముడవుతున్న అన్ని ఉత్పత్తులు చైనాలో తయారైనవేనని తెలిపారు. “మీ ఫోన్ వెనుక ఏమి రాసి ఉందో చెప్పండి. అది చైనాలో తయారైంది. నరేంద్ర మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేయడం ద్వారా అన్ని చిన్న వ్యాపారాలను నాశనం చేశారు. మీరు ఎక్కడ ఏ వస్తువు చూసినా అది చైనాలో తయారైనదే కనిపిస్తుంది. కానీ, మేము ఈ పరిస్థితిని మార్చాలని అనుకుంటున్నాం. అన్ని వస్తువులను బీహార్లో తయారు చేయాలని చెబుతున్నాము. మొబైల్స్, షర్టులు, ప్యాంటు, ఇవన్నీ బీహార్లో తయారు చేయాలి. ఆ కర్మాగారాల్లో బీహార్ యువతకు ఉపాధి లభించాలి. మనకు అలాంటి బీహార్ కావాలి” అని రాహుల్ పేర్కొన్నారు.

Rahul Gandhi | బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు

బీజేపీ (BJP) , ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ నేత ఆరోపించారు. “ఇప్పటివరకు మీకు లభించింది ఏదైనా, అది ఓటు అయినా, విద్య అయినా, ఆరోగ్యం అయినా రాజ్యాంగం వల్లనే. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం (RSS Constitution)పై దాడి చేస్తున్నారు. వారు ఓట్లను దొంగిలించడం ద్వారా దానిపై దాడి చేస్తున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. భారతదేశంలోని ఏదైనా సంస్థకు ఆర్ఎస్ఎస్ వ్యక్తిని నియమించి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. కానీ మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాము. దానిని ఎవరూ నాశనం చేయలేరని నేను హామీ ఇస్తున్నానని” ఆయన అన్నారు.

Rahul Gandhi | బీజేపీ చేతుల్లో నితీశ్

బీజేపీని ఇద్దరు, ముగ్గురే నియంత్రిస్తున్నారని, జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) కూడా బీజేపీ చేతిలో రిమోట్ గా మారారని రాహుల్ గాంధీ ఆరోపించారు.“నితీష్ జీ ముఖాన్ని ముందు పెడుతున్నారు. కానీ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది. అక్కడ అత్యంత వెనుకబడిన ప్రజల గొంతు వినిపిస్తుందని మీరు అనుకోకూడదు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు దానిని నియంత్రిస్తారు. బీజేపీ దానిని నియంత్రిస్తుంది. వారి చేతుల్లో రిమోట్ కంట్రోలర్ ఉందిజ వారికి సామాజిక న్యాయంతో సంబంధం లేదని” రాహుల్ అన్నారు. 20 సంవత్సరాల నితీష్ ప్రభుత్వంలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని సంకీర్ణ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ విమర్శించారు. మీరందరూ మహాఘట్బంధన్ అభ్యర్థులకు ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మార్పు కోరుకుంటున్నారని నాకు తెలుసు, ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైందని తెలిపారు.