అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | సాయిబాబా ఆలయంలో (Saibaba temple) దోపిడి దొంగలు హల్చల్ సృష్టించారు. ఈ ఘటన నగరంలోని 17వ డివిజన్లో రాజీవ్‌నగర్ (Rajiv anagar) కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
3వ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్‌నగర్ ఆలయం సమీపంలోని సాయిబాబా ఆలయంలో అర్ధరాత్రి చొరబడ్డారు. ఆలయంలోని 30 తులాల వెండి కిరీటం, 4 కిలోల ఇత్తడి సాయిబాబా విగ్రహం, చెమాయిలు, రాగి చెంబులు, మంగళహారతి సామగ్రి తదితర విలువైన వస్తువులన్నీ దోచుకెళ్లారు.
ఉదయం ఆలయ అర్చకులు గుడికి వెళ్లగా తలుపులు తెరిచి ఉండడం.. సాయిబాబా విగ్రహంతో సహా వస్తువులన్నీ మాయమవడంతో వెంటనే 3వ టౌన్ పోలీస్‌స్టేషన్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.