అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balkonda | పోలీసులమని చెప్పి.. వాహనదారులకు జాగ్రత్తలు చెబుతున్నట్లు నటించి వారి నగలతో దుండగులు ఉడాయించారు. ఈ ఘటన బాల్కొండ పోలీస్ స్టేషన్ (Balkonda Police Station) పరిధిలో చోటుచేసుకుంది.
ముప్కాల్ గ్రామానికి చెందిన లింగాపురం గంగారెడ్డి తన బంధువు ఏర్గట్ల గ్రామానికి చెందిన కొప్పెల లింగవ్వతో బైక్‌పై పెర్కిట్‌లో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాల్కొండ శివారు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఆపారు. బుల్లెట్ బైక్‌పై వచ్చిన వారు తాము ఢిల్లీ పోలీసులమని చెప్పారు. దొంగతనాలు జరుగుతున్నాయని, నగలు మెడలో నుంచి తీసి పర్స్‌లో పెట్టుకోవాలని సూచించారు. అనంతరం వారిని మాటల్లో పెట్టి ఆ పర్సుతో ఉడాయించారు. కాగా అందులో ఏడు తులాల బంగారం ఉన్నట్లు బాధితులు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్ (SI Shailender) తెలిపారు.