- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిAlumni Association | 26 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

Alumni Association | 26 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట (Lingampet) మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో (Boys’ High School) 1998–99 బ్యాచ్​ పదో తరగతి విద్యార్థులు 26 ఏళ్ల తర్వాత ఒక్కోచోట కలుసుకున్నారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్థానిక మోహిన్ బాబా ఖాద్రీ ఫంక్షన్ హాల్​ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రామా గౌడ్, ప్రభు లింగం, టీఎల్ రావు, బుచ్చిరెడ్డి, గంగాధర్​లను ఘనంగా సన్మానించారు.

Alumni Association | మిత్రుల కుటుంబాలకు సాయం

తమ బ్యాచ్​లో మృతిచెందిన నలుగురు మిత్రుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. అలాగే 2025లో పదో తరగతిలో మండల టాపర్​గా నిలిచిన మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థి నిక్షయ్​కు రూ.3వేల నగదు బహుమతి అందజేశారు. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన విద్యార్థికి రూ.3000 నగదు ప్రోత్సహ బహుమతి ఇచ్చారు. 26 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News