Mla Bhupathi Reddy
Mla Bhupathi Reddy | కాళేశ్వరం పేరిట రాష్ట్రాన్ని దోచేశారు..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసిందని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ భవన్(Congress Bhavan)​లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్​ను ఘోష్​ కమిషన్(Ghosh Commission)​ విచారణ కోసం పిలవడంతో ఆయనలో అసహనం కనిపిస్తోందన్నారు. పెండింగ్​ ప్రాజెక్ట్​ల వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే కాంగ్రెస్​ ప్రభుత్వం సబ్​ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై (Kaleshwaram) కాదనే విషయాన్ని బీఆర్​ఎస్​ నాయకులు గ్రహించాలన్నారు. ఆ ప్రాజెక్ట్​ అవినీతిలో మామా అల్లుళ్లు అడ్డంగా దొరికిపోయారని అని అన్నారు. మరోవైపు కుటుంబ కలహాలతో అసహనానికి గురవుతున్న బీఆర్​ఎస్​ అగ్రనేతలు సీఎంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని సూచించారు.

Mla Bhupathi Reddy | విమర్శలు మానకపోతే భౌతికదాడులే..

ఇప్పటికైనా బీఆర్​ఎస్​​ నాయకులు పేలవమైన ఆరోపణలు మానకపోతే భౌతికదాడులకు సైతం తెగబడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం చూసిన బీఆర్​ఎస్​ నాయకులకు నిద్రపట్టట్లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని అధిష్టానానికి విన్నవించడం జరిగిందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.