అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తనను తొలగించిన నేపథ్యంలో ఆమె మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తనపై కుట్రలకు పాల్పడున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారన్నాన్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలోనే తెలంగాణ బొగ్గ గని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో (BRS Party Office) ఎన్నిక నిర్వహించారని మండిపడ్డారు. తాను అమెరికాకు వచ్చిన తర్వాతే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల (Singareni Workers) కోసం పోరాడుతున్న వారిపై కుట్ర పన్నుతున్నారన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కవిత గురువారం సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత రాసిన లేఖ సంచలన సృష్టించింది.
MLC Kavitha | రాజకీయ కారణాలతోనే ఎన్నిక
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు సేవ చేసుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్న కవిత.. ఈ పదేళ్లలో ప్రతి కార్మిక కుటుంబానికి సోదరిగా సేవలందించానని తెలిపారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో గౌరవాధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చానని చెప్పారు. 2015 ఆగస్టు నెలలో కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో (General Body Meeting) 1000 మందికి పైగా కలిసి తనను గౌరవాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారని కవిత తెలిపారు. అప్పటి నుంచి టీబీజీకేఎస్ తరఫున ఎన్నో పోరాటాలు చేశామన్నారు.
MLC Kavitha | కుట్రలు పన్నుతున్నారు..
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను పోరాడుతుంటే కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారని కవిత తెలిపారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న తనను తొలగించి వారి ఐక్యతను దెబ్బ తీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గని సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే కేసీఆర్(KCR)ను ఒప్పించి తాను తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించేలా చేశానన్నారు. తద్వారా సింగరేణిలో 19,463 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. సకల జనుల సమ్మెతో సింగరేణిలో కార్మికులు పనికి దూరంగా ఉంటే వారికి తమ హయాంలో ఇంక్రిమెంట్ ఇప్పించామని గుర్తు చేశారు. ఇలా కార్మికుల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చామని గుర్తు చేసిన కవిత.. ఇలాంటివి చేయడం కొందరికి నచ్చడం లేదన్నారు.
MLC Kavitha | అమెరికాకు వచ్చినప్పుడే ఎందుకిలా?
తాను అమెరికా పర్యటనకు వచ్చినప్పుడే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని కవిత పేర్కొన్నారు. పార్టీ రజతోత్సవ సభకు (Party Silver Jubilee Meeting) సంబంధించి తన తండ్రికి రాసిన లేఖను తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే బయట పెట్టారన్నారు. ఆ లేఖను లీక్ చేసి తనపై కుట్రలకు పాల్పడుతున్న వారేవరో బయట పెట్టాలని కోరితే తనపై కక్ష గట్టారన్నారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారన్నారు. ఈ కుట్రదారులే వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదనకు గురుయ్యారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా తొలగించారన్నారు. తాను ఆ పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తూనే ఉంటానన్నారు.