అక్షరటుడే, ఇందూరు : Dinesh Kulachari | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) చాలా స్థానాల్లో బీజేపీపై ఉన్న అభిమానంతోనే ప్రజలు బీజేపీ మద్దతుదారులను గెలిపించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం (BJP Office)లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Dinesh Kulachari | బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో..
బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో (Banswada Constituency) 45 స్థానాల్లోనే బీజేపీ మద్దతుదారులు పోటీలో నిలిచారని దినేష్ కులాచారి పేర్కొన్నారు. బోధన్ డివిజన్లో 13స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. అలాగే మిగితా ప్రాంతాల్లోనూ కొన్నిఓట్ల తేడాతో తమ పార్టీ మద్దతుదారులు ఓడిపోయారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 20 సర్పంచ్ స్థానాల్లో మద్దతుదారులు పోటీ చేశారన్నారు. అందులో ఐదుగురు విజయం సాధించారన్నారు.
Dinesh Kulachari | కాంగ్రెస్ ప్రముఖులు దృష్టిపెట్టినా..
బోధన్ డివిజన్ (Bodhan Division)కు సంబంధించి ఎడపల్లిలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినప్ప్పటికీ అక్కడ తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించాన్నారు. రెంజల్, నీలా గ్రామాల్లోనూ సుదర్శన్‌రెడ్డి మార్క్ కనిపించలేదని వివరించారు. మోస్రాల్లో 12 వార్డు మెంబర్లకు గాను 11 మంది బీజేపీ మద్దతుదారులే విజయం సాధించారని ఆయన స్పష్టం చేశారు.
Dinesh Kulachari | ఇందిరమ్మ ఇళ్లు రావని..
అనేకచోట్ల కాంగ్రెస్ నాయకులు కులసంఘాలను బెదిరించారన్నారు. కాంగ్రెస్‌కు ఓటువేయకపోతే ఇందిరమ్మ ఇళ్లు రావని పేర్కొంటూ ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికారులను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చాలాచోట్ల కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకకపోవడంతో తమ మద్దతుదారులను వారిగుప్పిట్లో పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొన్నారని ఆరోపించారు.
Dinesh Kulachari | గతంలో అధ్వానంగా అభివృద్ధి..
పదేళ్లు ఇందూరును పాలించిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta) పట్టణ ప్రజలకు ఏంచేశారో అందరికీ తెలిసిందేనన్నారు. అలాంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రజాసేవలో తలమునకలైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta)పై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందన్నారు.
Dinesh Kulachari | గతంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా..
ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తాది అని దుయ్యబట్టారు. సెంట్రల్ లైట్లకు ఒక్కో స్తంభానికి అనవసరంగా రూ.35వేలు ఖర్చు పెట్టిన ఘనత మాజీ ఎమ్మెల్యేదన్నారు. 2018 నుంచి 2023 వరకు నిధులు మంజూరైతే 50శాతం పనులు కూడా పూర్తిచేయలేదన్నారు. 20శాతం పనులు సగం వరకు పూర్తయ్యాయని.. మరో 30శాతం పనులు ప్రారంభం కూడా కాలేదన్నారు. పాత పెండింగ్ బిల్లులన్నింటినీ ధన్పాల్ సూర్యనారాయణ వచ్చాక క్లియర్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో జీవోలు వచ్చినప్పటికీ నిధులు విడుదల కాలేదన్నారు. ఎమ్మెల్యేగా ధన్పాల్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు పలుమార్లు వెళ్లి అర్బన్ సమస్యలు వివరించి నిధులు విడుదల చేయించారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.