Homeజిల్లాలుకామారెడ్డిMachareddy | మోసం చేసి భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు..

Machareddy | మోసం చేసి భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Machareddy | తమకు చెందిన భూమిని కొందరు మోసం చేసి వాళ్లపేర్లపై మార్పిడి చేసుకున్నారని బాధితులు వాపోయారు. ఈ మేరకు మాచారెడ్డి తహశీల్దార్ (Machareddy Tahsildar Office)​ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు.

మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన బాధితులు సిరిగాద మహేష్ గౌడ్, నర్సాగౌడ్, రవి గౌడ్ మాట్లాడుతూ..మండల కేంద్రంలో తమకు తాత ముత్తాతలకు చెందిన 4 గుంటల భూమి ఉందన్నారు. స్థలం పక్కనే ఉన్న రైస్​మిల్ (Rice Mill) యజమానులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ల సహకారంతో ఆ భూమిని వాళ్లపేర్లపై మార్పిడి చేసుకున్నారని ఆరోపించారు.

తమ భూమిలో రేకుల షెడ్డును వేసుకొని తామే కబ్జాలో ఉన్నామని అయితే.. పదిరోజుల క్రితం రైస్​మిల్​ యజమానులు దౌర్జన్యంగా షెడ్డును తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ సందర్భంగా తహశీల్దార్​ సరళకు వినతిపత్రం అందించగా.. పూర్తి విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.