ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​CM Chandrababu | సెల్​ఫోన్​ లేకుండా వాళ్లు ఇద్దరు ఉండలేరు.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

    CM Chandrababu | సెల్​ఫోన్​ లేకుండా వాళ్లు ఇద్దరు ఉండలేరు.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandrababu | సెల్​ఫోన్​ గురించి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాంటమ్‌ వ్యాలీ (Quantum Valley)పై విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. తాను 25 ఏళ్ల క్రితం సెల్​ఫోన్​ గురించి మాట్లాడినప్పుడు అందరూ హేళన చేశారన్నారు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, నీళ్లు ఇస్తుందా, షెల్టర్ ఇస్తుందా అన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ రోజు భర్త లేకుండా భార్య ఉంటుందని, భార్య లేకుండా భర్త ఉంటున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కానీ వారిద్దరు సెల్​ఫోన్​ (Cell Phone) లేకుండా ఉండడం లేదన్నారు. జీవితంలో ప్రస్తుతం సెల్​ఫోన్​ భాగం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

    CM Chandrababu | సాంకేతిక కేంద్రంగా అమరావతి

    కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిలో పలు కంపెనీలు నెలకొల్పేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. ఇందులో భాగంగా అమరావతిలో క్వాంటమ్​ పార్క్ (Quantum Park)​ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం బాబు మాట్లాడుతూ.. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవాలని సూచించారు.

    CM Chandrababu | ఆనాడే చెప్పా..

    భారత్​ ఐటీ హబ్​గా మారుతుందని తాను తొలిసారి సీఎం అయినప్పుడే చెప్పినట్ల చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిల్​గేట్స్​తో కలిసి ఐటీ అభివృద్ధిపై చర్చించానన్నారు. ప్రస్తుతం అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. రాజధానిలో సంస్థలను నెలకొల్పాలని ఆయన స్టార్టప్​ కంపెనీలను ఆహ్వానించారు.

    More like this

    Milad Un Nabi | మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ర్యాలీలు

    అక్షరటుడే, బోధన్ : Milad Un Nabi | పట్టణంలో మిలాద్​ ఉన్​ నబీ(Milad Un Nabi) సందర్భంగా...

    Stock Markets | చివరలో ప్రాఫిట్‌ బుకింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి(Tariff uncertainty) కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పెట్టుబడులు...

    Telangana University | తెయూలో విద్యార్థుల ఆందోళన: హెల్త్​కేర్​ సెంటర్​లో ఔషధాలు ఉంచాలని డిమాండ్​

    అక్షరటుడే,డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్​కేర్​ సెంటర్​ (Healthcare Center) ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు...