అక్షరటుడే, హైదరాబాద్: Secunderabad : మంచిగా.. టిప్ టాప్ గా రెడీ అయి వచ్చారు. అద్దెకు గది కావాలని ఇంట్లోకి చొరబడ్డారు. ఉన్నదంతా దోచుకెళ్లారు. సికింద్రాబాద్లోని వారాసిగూడ పోలీస్స్టేషన్ Warasiguda police station పరిధిలో ఈ ఘటన కలకలం రేపింది. పార్శిగుట్టలో పారిజాతం అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి దుండగులు, మిట్ట మధ్యాహ్నం సమయంలో వచ్చి డోర్ కొట్టారు.
ఆమె తలుపు తీయగానే గది అద్దె కోసం వచ్చినట్లు చెప్పారు. తాము ఇంటిని చూస్తామని లోపలికి చొరబడ్డారు. లోపలికి వెళ్లాక ఆమెను కుర్చీకి కట్టేసి బంధించారు. అనంతరం కత్తి చూపించి బెదిరించారు. బంగారం, నగదు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని భయపెట్టారు.
బాదిత మహిళ మెడలోని పుస్తెల తాడు, బీరువాలో దాచిన 3 తులాల బంగారం, రూ. 6 వేల నగదు దోచుకెళ్లారు. కాసేపటి తర్వాత కట్లు విడిపించుకుని, బయటకు పరిగెత్తి ఏడుస్తూ స్థానికులకు జరిగిన విషయం చెప్పారు. స్థానికుల సాయంతో వారాసిగూడ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.