అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | కొందరు వ్యక్తులు తనను దొంగనోట్ల (counterfeit currency) కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన రౌడీషీటర్ రియాజ్(rowdy sheeter Riyaz)కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియాజ్‌ను పట్టుకునే సమయంలో తన చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని పేర్కొన్నారు.
Nizamabad City | ‘నా గురించి ఎక్కడైనా విచారించుకోవచ్చు..’
ఫేక్ కరెన్సీతో (fake currency) తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ తనపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. మరికొంతమంది వాట్సాప్‌లో తప్పుడు సమాచారం పంపిస్తూ తనను చంపుతానని బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటివరకు తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని తనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా తానుంటున్న కాలనీకి వచ్చి ఎవరినైనా ఎంక్వైయిరీ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
