Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ‘తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు’

Nizamabad City | ‘తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు’

నగరంలో వెండి చోరీ కేసులో ట్విస్ట్​ చోటు చేసుకుంది. తన వద్ద పని చేస్తున్న ఇద్దరు వెండి చోరీ చేసినట్లు శివకుమార్​ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తమపై యజమాని తప్పుడు కేసులు పెడుతున్నారని వారు ఆరోపించారు.

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: Nizamabad City | తమపై యజమాని తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని నగరంలోని (Nizamabad) గాంధీగంజ్‌లో గల సిల్వర్‌ మర్చంట్‌లో పనిచేస్తున్న కన్నయ్య, ప్రశాంత్‌ అనే యువకులు ఆరోపించారు. బాధితులు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరేళ్లుగా అదే సిల్వర్‌ మర్చంట్‌లో (silver merchant) పని చేస్తున్నామన్నారు. వేతనం పెంచాలని, లేకపోతే వెళ్లిపోతామని యజమానులకు చెప్పామన్నారు. అయితే యజమానులైన అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత విభేదాలు, దొంగ బంగారం కేసు (Gold Theft Case) ఉండడంతో ఇదే అదునుగా తమని తప్పుడు కేసులో ఇరికించాలని యత్నిస్తున్నట్లు వాపోయారు.

70 కేజీల వెండి దొంగతనం చేసినట్లు కావాలని ఇరికించారని, దుకాణంలో సీసీ కెమెరాలు పరిశీలించాలని కోరారు. గత నెల 9న గొడవ జరగగా, రాత్రి తమని యజమానులు కొట్టారని, అంతేగాక తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తమ బైక్, మూడు సెల్‌ఫోన్లు దౌర్జన్యంగా లాక్కున్నారని తెలిపారు. తాము ఎక్కడికి పారిపోమని, పోలీసులకు సహకరిస్తామని చెప్పారు. తమ పిల్లలకు ఏదైనా జరిగితే షాప్‌ యజమానులే బాధ్యత వహించాలని యువకుల తల్లిదండ్రులు వాపోయారు.