అక్షరటుడే, వెబ్‌డెస్క్:Raghunandan Rao | బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao) మరోసారి స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని ఆయన తెలిపారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు.
Raghunandan Rao | కవిత కొత్త పార్టీ పెడతారు
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొత్త పార్టీ పెడతారని రఘునందన్ అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బలహీనపడాలి అనుకునేవాళ్లే కవిత వెనక ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారే ఆమెతో మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Raghunandan Rao | ఆమె చెల్లని రూపాయి..
కవిత, కేటీఆర్(KTR)కు ఎలాంటి బ్రాండ్ లేదని మెదక్ ఎంపీ అన్నారు. కవిత చెల్లని రూపాయి అయిపోయారని, చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసే ప్రక్రియ జరుగుతోందని ఎద్దేవా చేశారు. కవిత జాగృతి పెట్టకముందు తెలంగాణ(Telangana)లో బతుకమ్మ ఆడలేదా అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
Raghunandan Rao | కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే..
రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బలహీనం అయిపోయిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అభ్యర్థులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సొంతంగా ఎదుగుతున్న బీజేపీని చూసి కేడర్‌లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరు అడిగారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ఒక్కటేనని చెప్పి పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని, పొత్తులు, విలీనాలపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
Raghunandan Rao | ధైర్యముంటే ప్రెస్‌మీట్ పెట్టండి
కవిత చిట్‌చాట్ పేరుతో వ్యాఖ్యలు చేయడాన్ని రఘునందన్ ఖండించారు. ధైర్యం ఉంటే ప్రెస్‌మీట్(Press Meet) పెట్టి అన్ని వివరాలు బయట పెట్టాలని సవాల్ చేశారు. చిట్‌చాట్‌ల పేరుతో తమ పార్టీని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. ‘‘మీ సొంత పంచాయితీలు మీరే తేల్చుకోండి.. మమ్మల్ని లాగొద్దు” అని ఆయన సూచించారు. హరీశ్ రావు బీజేపీ కోవర్టు (Harish Rao BJP Covert) అయితే అప్పట్లో మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించలదేని ఆయన ప్రశ్నించారు.