ePaper
More
    HomeజాతీయంNeeraj Chopra | మా అమ్మను తిడుతున్నారు.. నీరజ్ చోప్రా భావోద్వేగం!

    Neeraj Chopra | మా అమ్మను తిడుతున్నారు.. నీరజ్ చోప్రా భావోద్వేగం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Neeraj Chopra | సోషల్ మీడియా(Social Media) వేదికగా తన తల్లిని, కుటుంబ సభ్యులను జుగుప్సాకరంగా తిడుతున్నారని భారత బళ్లెం వీరుడు(Indian wrestling hero), గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా(Golden Bhai Neeraj Chopra) ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చాడు. పాకిస్థాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌ను భారత్‌కు ఆహ్వానించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి(Terror Attack) తర్వాత పాక్ అథ్లెట్‌(Pakistani athlete)ను ఆహ్వానించడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నీరజ్ చోప్రాపై మండిపడ్డారు. ఈ క్రమంలో కొందరు అతని కుటుంబ సభ్యులపై కూడా విమర్శలు గుప్పించారు.

    ఈ ట్రోలింగ్‌(trolling)పై స్పందిస్తూ నీరజ్ చోప్రా భావోద్వేగానికి గురయ్యాడు. ‘నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్‌కు అర్షద్ నదీమ్‌(Arshad Nadeem)ను ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ చాలా మంది నన్ను, నా కుటుంబ సభ్యులను తిడుతున్నారు. అందులో అసభ్యకరమైన కామెంట్స్ ఉన్నాయి. మా అమ్మను కూడా తిట్టారు. ఓ అథ్లెట్‌గా మాత్రమే అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించాను. అత్యుత్తమ ఆటగాళ్లందర్నీ భారత్‌కు తీసుకురావడమే ఈ టోర్నీ(Torni) లక్ష్యం. సోమవారానికి ముందే ఈ టోర్నీకి సంబంధించిన ఆహ్వానాల ప్రక్రియ ముగిసింది. పహల్గాం ఉగ్రదాడికి ముందే ఇదంతా జరిగింది.

    ఆ తర్వాత 48 గంటల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాకు ఎప్పుడు దేశ ప్రయోజనమే ముఖ్యం. ఈ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు మద్దతుగా నిలుస్తా. ఈ ఘటనపై నాకు బాధతో పాటు కోపం కూడా ఉంది. దేశంపై నా చిత్తశుద్దిని ప్రశ్నించడం బాధగా ఉంది. నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్(target) చేస్తూ విమర్శలు చేసిన వారికి సమాధానం ఇచ్చేందుకే ఈ వివరణ ఇస్తున్నా.’అని నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. షెడ్యూల్ ప్రకారం మే 24న బెంగళూరు వేదికగా నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నీ(Classic tournament) జరగనుంది.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...