HomeUncategorizedBombay High Court | వారు నిర్దోషులే.. రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన...

Bombay High Court | వారు నిర్దోషులే.. రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bombay High Court | ముంబై రైలు పేలుళ్ల కేసు(Bombay Train Blasts Case)లో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. ఆ కేసులో మొత్తం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. 2006లో ముంబై సబర్బన్​ రైళ్ల(Mumbai Suburban Trains)లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో అధికారులు 12 మందిని నిందితులు పేర్కొనగా.. నేరం నిరూపించడంతో ప్రాసిక్యూషన్​ విఫలమైందని కోర్టు తెలిపింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

Bombay High Court | అసలు ఏం జరిగిందంటే..

ముంబైలోని పలు సబర్బన్​ రైల్లలో 2006 జులై 11న వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 189 మంది ప్రజలు చనిపోయారు. మరో 800 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అప్పటి నుంచి విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు 2015లో 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. బాంబులు అమర్చారన్న అభియోగలు ఉన్న ఐదుగురికి మరణ శిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. నిందితుల్లో ఓ వ్యక్తి కరోనాతో 2021లో జైలులో మృతి చెందాడు.

Bombay High Court | హైకోర్టులో అప్పీల్​

ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు బాంబే హైకోర్టు(Bombay High Court)ను ఆశ్రయించారు. వారి పిటిషన్​ సవాల్​ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కూడా పిటిషన్​ వేసింది. ఈ కేసు విచారణకు 2024 జులైలో హైకోర్టు ప్రత్యేక బెంచ్​ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. 12 మంది నిందితులు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో ఒకరు మృతి చెందడంతో మిగతా 11 మంది జైలు నుంచి విడుదల కానున్నారు.