ePaper
More
    HomeతెలంగాణCM Revanth | బడులు నిర్మిస్తుంటే విమర్శిస్తున్నారు: సీఎం రేవంత్​ రెడ్డి

    CM Revanth | బడులు నిర్మిస్తుంటే విమర్శిస్తున్నారు: సీఎం రేవంత్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం యంగ్​ ఇండియా రెసిడెన్సియల్​ స్కూల్స్ (Young India Schools)​ నిర్మిస్తుంటే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు.

    హైదరాబాద్​లోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆయన అవార్డులు అందజేశారు.

    ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 యంగ్​ ఇండియా స్కూల్స్​ కోసం రూ.200 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. అయితే బలహీన వర్గాల పిల్లలకు అన్ని కోట్లతో పాఠశాలలు అవసరమా? అని ఓ పార్టీకి చెందిన పత్రికలో తనను విమర్శిస్తూ వార్తలు రాశారన్నారు. కార్పొరేట్​కు దీటుగా సకల హంగులతో పేదలకు మెరుగైన విద్య అందేలా తాము యంగ్​ ఇండియా స్కూల్స్​ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    CM Revanth | వారు బర్రెలు.. గొర్రెలు ఇచ్చారు

    బీఆర్​ఎస్(BRS)​ హయాంలో పేదలను చదువులకు దూరం చేశారని రేవంత్​రెడ్డి విమర్శించారు. బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి.. చెప్పులు కట్టుకోండి అని స్కీంలు పెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను వారి కుల వృత్తులకే పరిమితం చేసేలా పథకాలు తెచ్చిందని విమర్శించారు. రాజ్యాధికారానికి, చదువులకు పేదలను దూరం చేశారన్నారు.

    CM Revanth | ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

    అసమానతలు తొలగించి సమసమాజం నిర్మించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువు చాలా ముఖ్యమన్నారు. చదువులో మరో మెట్టు ఎక్కబోతున్న విద్యార్థుల ముందు రకరకాల రంగుల ప్రపంచం ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. 25 ఏళ్లు వచ్చే వరకు కష్టపడి చదువుకుంటే.. ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి, భవిష్యత్తులో రాణించడానికి వీలవుతుందని సూచించారు. దారితప్పితే తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...