ePaper
More
    HomeసినిమాMovies against terrorism | ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా భార‌తీయ సినిమాలు.. చూస్తే రోమాలు నిక్క‌బొడుచుకోవాల్సిందే..!

    Movies against terrorism | ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా భార‌తీయ సినిమాలు.. చూస్తే రోమాలు నిక్క‌బొడుచుకోవాల్సిందే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Movies against terrorism | పహల్‌గామ్ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా బుధవారం ఉదయం పాకిస్థాన్ Pakistan బహావల్పూర్‌లో భారత సైన్యం (Indian Army) చేసిన దాడుల్లో దాదాపు వంది మంది ఉగ్ర‌వాదులు క‌న్నుమూసిన‌ట్టు తెలుస్తోంది. భారత సాయుధ దళాలు (Indian armed forces) పాకిస్థాన్ పంజాబ్, పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశాయి. ఆప‌రేష‌న్ సింధూర్​(operation Sindoor) పేరుతో జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ క్ర‌మంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిన కొన్ని భారతీయ సినిమాలు (Indian movies) తెర‌పైకి వ‌చ్చాయి. అవి మ‌న‌ల్ని అల‌రించ‌డ‌మే కాకుండా, దేశ భక్తిని కూడా ప్రేరేపించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన వైఖరితో తీసిన కొన్ని చిత్రాలు మంచి విజ‌యాలు కూడా సాధించాయి.

    Movies against terrorism | చైత‌న్యం క‌లిగించిన సినిమాలివే..

    ముందుగా కృష్ణవంశీ దర్శకత్వం (Director Krishna Vamsi) వహించిన ‘ఖడ్గం’ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వచ్చిన అత్యంత ప్రసిద్ధ తెలుగు చిత్రాలలో ఒకటి. ఇక 2000 సంవ‌త్స‌రంలో ‘ఆజాద్’ అనే చిత్రం రాగా, ఇందులో నాగార్జున (hero akkineni nagarjuna).. మతాన్ని ముసుగుగా ఉపయోగించే ఉగ్రవాదులతో పోరాడుతాడు. ఈ చిత్రం ఉగ్రవాదులు మన మధ్య గుర్తించబడకుండా ఎలా జీవించవచ్చో చూపించింది. ఇక 2016లో వచ్చిన టెర్ర‌ర్ చిత్రంలో శ్రీకాంత్ ఉగ్రవాద దాడిని (terrorist attack) ఆపడానికి తన ప్రాణాలను పణంగా పెట్టే పోలీసు అధికారిగా న‌టించి అల‌రించాడు. 2002లో వ‌చ్చిన మేజ‌ర్ Major చిత్రం 26/11 ముంబై దాడులలో (Mumbai attacks) ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత నేప‌థ్యంలో రూపొంది మంచి విజ‌యం సాధించింది.

    2018లో వ‌చ్చిన గూఢచారి చిత్రం (Goodachari movie) దేశాన్ని రక్షించడానికి పనిచేసే ఒక రహస్య ఏజెంట్ కథగా (secret agent story) రూపొందింది. 2017లో వ‌చ్చిన యుద్ధం శరణం చిత్రం ఉగ్రవాదం కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూపించడానికి ప్రయత్నించింది. ఇక 2010లో వ‌చ్చిన వేదం చిత్రంలో తీవ్రవాదం ఎంత ప్రమాదకరమైనదో చూపించారు. ఐక్యతను ప్రోత్సహించింది. ఇక ఇవేకాక డబ్బింగ్ చిత్రాలు విశ్వరూపం (Vishwaroopam), తుపాకి, రోజా (Roja) వంటి సినిమాలు ఉగ్రవాద ప్రమాదాలను, దానిపై పోరాడే వారి బలాన్ని శక్తివంతంగా చూపించాయి. ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ (Uri: The Surgical Strike) 2019, అవరోధ్ : ది సీజ్ వితిన్ (2019), రక్షక్ : ఇండియాస్ బ్రేవ్ చాప్టర్ 2 (Rakshak: India’s Brave Chapter 2) 2023, రణనీతి : బాలాకోట్ అండ్ బియాండ్ (2024), ఫైటర్ (2024), ఆపరేషన్ వాలెంటైన్ (2024), స్కై ఫోర్స్ (Sky Force) 2025 వంటి చిత్రాలు కూడా వైమానిక దాడుల నేపథ్యంలో వచ్చిన ఉత్తమ చిత్రాలు. ఇది కూడా ప్రేక్ష‌కుల‌లో దేశ భ‌క్తిని ర‌గిలించాయి.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...