ePaper
More
    HomeజాతీయంRoads Damaged | ఇవేం రోడ్లు బాబోయ్​.. ప్రారంభించిన ముణ్నాళ్లకే ధ్వంసం

    Roads Damaged | ఇవేం రోడ్లు బాబోయ్​.. ప్రారంభించిన ముణ్నాళ్లకే ధ్వంసం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Roads Damaged | వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్లు మూణ్నాళ్లకే ధ్వంసం అవుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్లు వేయడం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఏళ్ల పాటు మన్నిక ఇవ్వాల్సిన రోడ్లు రోజుల్లోనే కొట్టుకు పోతున్నాయి. ఇటీవల వర్షాలకు పలు రాష్ట్రాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. అవినీతికి అలవాటు పడిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు(Contractors) నాసిరకంగా రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అవి భారీ వర్షాలకు కొట్టుకుపోవడం, కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    Roads Damaged | ప్రారంభించిన మరుసటి రోజే..

    మహారాష్ట్ర(Maharashtra)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి కల్యాణ్​ శిల్​ రోడ్డు(Kalyan Shil Road)లో ఫ్లై ఓవర్​పై రోడ్డు గుంతల మయంగా మారింది. అయితే ఆ ఫ్లై ఓవర్​ను జులై 4న ప్రారంభించారు. జులై 5న వర్షానికి ఆ రోడ్డు గుంతలమయంగా మారి.. ప్రయణించలేని విధంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

    కల్యాణ్​ జిల్లాలో ఈ ఫ్లైఓవర్​ను ఆరేళ్ల పాటు నిర్మించారు. కానీ 24 గంటల్లోనే ఈ రోడ్డును మళ్లీ మూసి వేశారు. డోంబివ్లి‌‌– కల్యాణ్‌ ప్రాంతాలను కొత్త ముంబైకి అనుసంధానించే మార్గంలో ఈ ఫ్లై ఓవర్​తో ట్రాఫిక్​ రద్దీ తగ్గుతుంది. కీలకమైన ఈ ఫ్లై ఓవర్(Flyover)​ నిర్మాణంలో అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కొరవడడంతో నాసిరకంగా నిర్మించారు. ఒక్క వర్షానికే రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలు వైరల్​ అవుతోంది. దీంతో అధికారులు ప్రస్తుతానికి ఫ్లై ఓవర్​ మూసి వేసి మరమ్మతులు చేస్తున్నారు.

    Roads Damaged | రాజస్థాన్​లో..

    రాజస్థాన్​ (Rajasthan)లో రూ.135 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్​ ఒక్క వర్షానికి కుంగిపోయింది. రాజస్థాన్​లోని అజ్మీర్​లో ఇటీవల ఫ్లై ఓవర్​ నిర్మించారు. ఈ వంతెనకు ప్రభుత్వం రామసేతు (Rama Setu) అని పేరు పెట్టింది. అయితే ఈ నెల 2న కురిసిన వర్షానికి ఫ్లై ఓవర్​ కుంగిపోయింది. దీంతో ప్రభుత్వం సీరియస్​ అయింది. విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది.

    Roads Damaged | మధ్యప్రదేశ్​లో…

    మధ్యప్రదేశ్​ (Madhya Pradesh)లో భారీ వర్షాల దాటికి రూ.40 కోట్లతో నిర్మించిన ఓ వంతెన నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్​లోని రాష్ట్ర రహదారి 22 (State Highway 22)పై ఇటీవల రూ.40 కోట్లతో వంతెన నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి ఆ వంతెన మొత్తం కొట్టుకుపోయింది. నర్సింగ్‌పూర్‌‌‌– హోషంగాబాద్‌ను కలుపుతూ నిర్మించిన వంతెన కొట్టుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారలు ఆ మార్గాన్ని మూసి వేశారు. కాగా కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వంతెనలు, రోడ్లు కొద్ది రోజులకే ధ్వంసం అవుతుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా పనులు చేపడుతున్నారని మండి పడుతున్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

    Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి సామాన్యుల‌కి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...