HomeUncategorizedPahalgam Terror Attack | ఉగ్రదాడికి పాల్పడింది వీరే.. ఊహాచిత్రాలు విడుదల

Pahalgam Terror Attack | ఉగ్రదాడికి పాల్పడింది వీరే.. ఊహాచిత్రాలు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Pahalgam Terror Attack | కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రదాడికి పాల్పడిన వారి ఊహచిత్రాలను భద్రత బలగాలు(Security forces) విడుదల చేశాయి. ఈ ఘటనలో ఐదు నుంచి ఆరుగురు టెర్రరిస్టులు(Terrorists) పాల్గొని ఉండొచ్చని సమాచారం. అయితే పర్యాటకుల పేర్లు, ఐడీ కార్డులు అడిగి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు, మృతుల కుటుంబికులు చెప్పిన వివరాల ఆధారంగా ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేశారు.దాడికి పాల్పడిని ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.

వీరు కశ్మీర్​ దాటి వెళ్లే అవకాశం లేదని, స్థానికంగా ఎక్కడో దాక్కొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ముష్కరులను అదుపులోకి తీసుకోవడానికి భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్(Search operation)​ కొనసాగిస్తున్నాయి.