HomeతెలంగాణCabinet Expansion | కొత్త మంత్రులు వీరే.. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం!

Cabinet Expansion | కొత్త మంత్రులు వీరే.. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Expansion | రాష్ట్రంలో ఎంతోకాలంగా పెండింగ్​లో ఉన్న మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కొలిక్కి వచ్చింది. ఎంతోమంది ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. మంత్రి పదవులు దక్కే ముగ్గురి పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు అధిష్ఠానం నుంచి ఆమోదం లభించింది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత కేబినెట్​ విస్తరణ చేపట్టన్నారు.

ఎస్సీ మాల సామాజికవర్గం కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ (Gaddam Vivek)కు మంత్రిగా అవకాశం దక్కనుందని తెలిసింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Satyanarayana)కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముదిరాజ్​ కులానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (Srihari)కి కేబినెట్‌లో బెర్త్ ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, వీరి ప్రమాణ స్వీకారానికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం పెద్దల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అవసరమైతే మరొకరు లేదా ఇద్దరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.