HomeతెలంగాణCabinet Expansion | కొత్త మంత్రులు వీరే.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్​రెడ్డి

Cabinet Expansion | కొత్త మంత్రులు వీరే.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Expansion | గ‌త కొద్ది రోజులుగా రేవంత్ (Revanth reddy) టీమ్‌లో ఎవ‌రెవ‌రు జాయిన్ కానున్నార‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డిచాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రేవంత్ టీంలోకి కొత్త మంత్రులు చేరనున్నారు. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు (Minister Posts) ఖాళీగా ఉండగా.. ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:19 గంటలకు కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. తాజా మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి) పేర్లు ఖరారయ్యాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందింది.

Cabinet Expansion | కొద్ది నిమిషాల‌లో ప్ర‌మాణ స్వీకారం..

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ (Governer Jishnu Dev Verma) వారితో ప్ర‌మాణ స్వీకారం చేయించనున్నారు. తొలి నుంచి రేసులో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)కి ఈ సారి ఛాన్స్ లేనట్లే. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇక గడ్డం వివేక్ (Vivek) అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉండగా.. మంత్రి పదవి హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ తర్వాత జరిగిన పలు ధపా చర్చల్లోనూ వివేక్ పేరు మంత్రి పదవుల రేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే ఎవరూ ఉహించని విధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి ఈ ముగ్గురు నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

ఇక సామాజిక వర్గాల వారీగా ప‌రంగా, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు కాగా, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. అలాగే డిప్యూటీ స్పీకర్​గా రామ్​చంద్రునాయక్​ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నేతలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మ‌రోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొత్త మంత్రులకు, డిప్యూటీ స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.