అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Municipal MIM candidates | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Nizamabad Municipal Corporation elections) భాగంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా.. తాజాగా ఎంఐఎం (MIM) తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 22 స్థానాల్లో బరిలో దిగనుంది. ఇందులో 21 మంది జాబితాను విడుదల చేసింది. 10వ డివిజన్ అభ్యర్థిని ఇంకా వెల్లడించలేదు. కాగా.. 21 మందిలో 10 మంది పాత వారే కాగా.. మిగతా 10 మంది కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది.
అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తమ స్థానాలను పెంచుకునేందుకు ఎంఐఎం తీవ్ర కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సగం కన్నా ఎక్కువ మంది కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేశారు. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 16 చోట్ల గెలుపొందగా.. ఈ సారి పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
అభ్యర్థుల జాబితా ఇదే..
11వ డివిజన్ ఎండీ జకీరుద్దీన్, 12వ డివిజన్ సమీర్అలీ, 13వ డివిజన్ రాజ్ గణేశ్, 14వ డివిజన్ మీరు ముంతాజ్ అలీ, 15వ డివిజన్ ఎండీ సిరాజ్ అహ్మద్, 29వ డివిజన్ ఎండీ ఖదీర్, 30వ డివిజన్ ఎండీ సలీమ్, 31వ డివిజన్ నజీర్ అహ్మద్, 32వ డివిజన్ ఎండీ రియాజ్ అహ్మద్, 33వ డివిజన్ షేక్ మోతాసిమ్, 46వ డివిజన్ అర్షద్ పాషా, 51వ డివిజన్ అబ్దుల్ అలీ భగవాన్, 52వ డివిజన్ ఎండీ షకీల్ అహ్మద్, 53వ ఇంతియాజ్ అహ్మద్, 54వ డివిజన్ ఎండీ షకీల్ అహ్మద్, 55వ డివిజన్ ఎండీ ఇద్రిస్ ఖాస్, 56వ డివిజన్ ఎండీ హఫీజ్, 57వ డివిజన్ ఎండీ అమర్, 58వ డివిజన్ అజీజ్ అహ్మద్, 59వ డివిజన్ రఫత్ ఖాన్, 60వ డివిజన్ ఎండీ ముఖీమ్ గఫూర్.