IPL 2025 | ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లు ఇవే!
IPL 2025 | ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లు ఇవే!

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ తుది దశకు చేరడంతో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తిరంగా మారింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. మిగతా 8 జట్లు టాప్-4 స్థానాల కోసం పోటీపడుతున్నాయి. 54 మ్యాచ్‌లు ముగిసే సరికి ఆర్‌సీబీ(RCB), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. ఇందులో ఆర్‌సీబీ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా ఆ జట్టు టాప్-2 ప్లేస్‌లో నిలవనుంది.

ప్రస్తుతానికి ఆర్‌సీబీతో పాటు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేకేఆర్(KKR), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తమ చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలిస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు ఒక్క శాతం ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉండగా.. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆ జట్టు భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడితే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోనుంది.

ఐపీఎల్(IPL) ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 ఆడనుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతాయి. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ చేరనుండగా.. ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 ఆడుతోంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్లో తలపడుతుంది. ఈ క్రమంలోనే జట్లు టాప్-2లో నిలిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక నుంచి జరిగే ప్రతీ మ్యాచ్‌ కీలకమే. ప్లే ఆఫ్స్ రేసులో లేని జట్లు ఆడే మ్యాచ్‌‌లు కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

54 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీమ్స్ ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఏంటంటే..?

1.ఆర్‌సీబీ 95శాతం
2.పంజాబ్ కింగ్స్-92 శాతం
3. ముంబై ఇండియన్స్-80 శాతం
4. గుజరాత్ టైటాన్స్-90 శాతం
5.ఢిల్లీ క్యాపిటల్స్-50 శాతం
6.కేకేఆర్-10 శాతం
7. లక్నో సూపర్ జెయింట్స్-5శాతం
8.సన్‌రైజర్స్ హైదరాబాద్-1శాతం
9.రాజస్థాన్ రాయల్స్-ఔట్
10.చెన్నై సూపర్ కింగ్స్-ఔట్