అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS | భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) (బీఆర్ఎస్) శాసనసభాపక్ష ఉపనేతలను పార్టీ నియమించింది. ఈ మేరకు అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ శాసనసభలో పార్టీకి (Telangana Legislative Assembly) చెందిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టి.హరీశ్ రావు (T. Harish Rao), పి.సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను ఎంపిక చేసింది.
BRS | శాసన మండలిలోనూ..
అదేవిధంగా.. శాసన మండలిలో బీఆర్ఎస్ ఉపనేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించింది. ఇక పార్టీ విప్ పదవిని దేశపతి శ్రీనివాస్‌కు కట్టబెట్టింది. ఈ నియామకాలను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Kalvakuntla Chandrashekar Rao)(కేసీఆర్) ఆమోదించారు. ఈ నిర్ణయంతో శాసనసభ, మండలి సమావేశాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.