అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా(Education Secretary Yogita Rana) ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా నుంచి గెజిటెడ్ హెడ్మాస్టర్ విభాగంలో మోపాల్ మండలం బోర్గాం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో కంజర(ksnjsr) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రాఘవాపురం గోపాలకృష్ణ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఇద్దరు ఉపాధ్యాయులను అభినందించారు.
Best Teacher Award | కామారెడ్డి నుంచి..
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. రాజంపేట(Rajampet) మండలం పొందుర్తి (Pondurthi) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న స్వామి, గాంధారి(Gandhari) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ భవానీ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని డీఈఓ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఎస్జీటీలను డీఈఓ అభినందించారు.