HomeజాతీయంHybrid Cars | బెస్ట్‌ హైబ్రిడ్‌ కార్లు ఇవే!

Hybrid Cars | బెస్ట్‌ హైబ్రిడ్‌ కార్లు ఇవే!

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కార్ల అమ్మకాలు పెరిగిపోయాయి. ఇందులో ఎక్కువగా హైబ్రిడ్‌ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మైలేజీని అందించే ఐదు బెస్ట్‌ హైబ్రిడ్‌ కార్ల గురించి తెలుసుకుందామా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hybrid Cars | ఇంధన ధరలు (fuel prices) మరియు కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో సంప్రదాయ పెట్రోల్‌ లేదా డీజిల్‌తో (petrol-diesel) నడిచే కార్లు మరియు పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాల (electric vehicles) మధ్య ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ కార్లు ప్రజాదరణ పొందుతున్నాయి.

ఇంధన సామర్థ్యం, పొదుపు పరంగా చాలామంది హైబ్రిడ్‌ కార్లను ఎంచుకుంటున్నారు. ఆకట్టుకునే మైలేజ్‌, తక్కువ రన్నింగ్‌ ఖర్చులు, పర్యావరణ అనుకూల పనితీరుతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాదిలో పలు కంపెనీల మోడళ్లు అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందించి విశేష ఆదరణ చూరగొన్నాయి. టాప్‌5లో ఉన్న కంపెనీలలో మారుతి గ్రాండ్‌ విటారా (Maruti Grand Vitara), టయోటా హైరైడర్‌ అత్యంత ఇంధన సమర్థవంతమైన ఎస్‌యూవీలుగా నిలవగా.. సామర్థ్యంతోపాటు ఎక్కువ సీటింగ్‌ కెపాసిటీని కోరుకునే కుటుంబాలు ఇన్నోవా హైక్రాస్‌, మారుతి ఇన్‌విక్టో ఎంపిక చేసుకుంటున్నాయి.

Hybrid Cars | మారుతి సుజుకీ ఇన్‌విక్టో..

మారుతి సుజుకీి ఇన్‌విక్టో (Maruti Suzuki Invicto) నెక్సా డీలర్‌షిప్‌ల శ్రేణిలో ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌. ఇది లీటర్‌ ఇంధనానికి 23 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది ప్రీమియం కంఫర్ట్‌, హైబ్రిడ్‌ ఫ్యుయల్‌ సేవింగ్స్‌ వంటి ఫీచర్లు కలిగి ఉంది. దీని ధర రూ. 24.97 లక్షల వరకు ఉంటుంది. మెరుగైన సామర్థ్యంతో ప్రీమియం ఎంపీవీని కోరుకునే వారికి ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

Hybrid Cars | మారుతి సుజుకీ గ్రాండ్‌ విటారా..

మారుతి సుజుకీ గ్రాండ్‌ విటారా (Maruti Suzuki Grand Vitara) భారతదేశంలో అత్యంత ఇంధన సమర్థవంతమైన ఎస్‌యూవీలలో ఒకటి. గ్రాండ్‌ విటారా దాని స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ అవతార్‌లో మూడు సిలిండర్ల 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 27.97 కి.మీ./లీ మైలేజీని అందిస్తుంది. ఇది 9అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే/ఆండ్రాయిడ్‌ ఆటో మరియు ప్రీమియం ఇంటీరియర్‌ వంటి అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది. ఈ కారు ధర రూ. 16.63 లక్షలు.

Hybrid Cars | టొయోటా అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌

టయోటాకు చెందిన అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ కారు (Urban Cruiser Highrider Car) ఎస్‌యూవీ డిజైన్‌లో ఉంటుంది. ఈ కారులో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లున్నాయి. ఇది 27.97 కి.మీ./లీ మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 16.46 లక్షలు. స్టైలిష్‌ ఎస్‌యూవీ డిజైన్‌, అధునాతన ఫీచర్లు మరియు నగర ట్రాఫిక్‌లో అద్భుతమైన పనితీరుతో హైరైడర్‌ భారతదేశంలో ఇంధన ఆర్థిక వ్యవస్థకు ఉత్తమ హైబ్రిడ్‌ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలుస్తోంది.

Hybrid Cars | హోండా సిటీ డీ : హెచ్‌ఈవీ

హోండా సిటీ డీ : హెచ్‌ఈవీ హైబ్రీడ్‌ బ్లెండ్‌ స్టైల్‌ హైబ్రిడ్‌ కారు. ఇది స్టైల్‌, రిఫైన్‌మెంట్‌ మరియు క్లాస్‌ లీడిరగ్‌ ఎఫీషియన్సీని మిళితం చేస్తుంది. పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ మోడ్‌లోకి (petrol and electric modes) సులభంగా మార్చుకోవచ్చు. ఇది 27.1 కిమీ/లీ మైలేజీతో దేశంలోని అత్యంత ఇంధన సమర్థవంతమైన సెడాన్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

Hybrid Cars | టొయోటా ఇన్నోవా హైక్రాస్‌

టయోటా ఇన్నోవా హైక్రాస్‌ (Toyota Innova Hycross) హైబ్రిడ్‌ గేమ్‌ చేంజర్‌. ఎక్కువ సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఈ కారు పెద్ద ఫ్యామిలీ కోసం సరైనది. ఈ హైబ్రిడ్‌ మోడల్‌ కారు 23.24 కి.మీ./లీ. మైలేజీ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 25.90 లక్షలు.