HomeజాతీయంNew Labour Codes | కొత్త కార్మిక​ చట్టాలతో ప్రయోజనాలు ఇవే..

New Labour Codes | కొత్త కార్మిక​ చట్టాలతో ప్రయోజనాలు ఇవే..

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. అవి శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: New Labour Codes | కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్​ చట్టాలను (new labor laws) నోటిఫై చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ (Union Minister Mansukh Mandaviya) ఎక్స్​ వేదికగా ప్రకటించారు.

400 మిలియన్లకు పైగా కార్మికులకు కనీస వేతనాలు, గ్రాట్యుటీ మరియు సామాజిక భద్రతకు హామీ ఇచ్చే నాలుగు ప్రధాన కార్మిక కోడ్‌లను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

కొత్త కార్మిక సంస్కరణలు స్వావలంబన భారతదేశం వైపు ఒక ముఖ్యమైన అడుగు అని కేంద్ర మంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యానికి అనుగుణంగా వీటిని రూపొందించినట్లు చెప్పారు. అన్ని రకాల కార్మికులకు సకాలంలో కనీస వేతనాల హామీ, యువతకు నియామక లేఖలు, మహిళలకు సమాన వేతనం, గౌరవం, కార్మికులకు సామాజిక భద్రత, ఒక సంవత్సరం ఉద్యోగం తర్వాత స్థిర-కాలిక ఉద్యోగులకు గ్రాట్యుటీ కల్పించాలని కొత్త చట్టాల్లో పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్​ రంగాల్లో (private sector) పని చేసే కార్మికులకు ఎంతో మేలు జరగనుంది.

New Labour Codes | కొత్త చట్టాలు ఇవే

కేంద్రం వేతనాల కోడ్, 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020ని ప్రవేశ పెట్టింది. కేంద్రం నాలుగు కొత్త కార్మిక నియమావళిని అమలు చేసిందని, ఈరోజు నుంచి అమలులోకి వస్తుందని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాలం చెల్లిన 29 చట్టాలను అప్​డేట్​ చేసి ఈ నాలుగు చట్టాలు తెచ్చినట్లు పేర్కొంది.

New Labour Codes | కార్మికులకు ప్రయోజనాలు

కొత్త చట్టాల ప్రకారం కార్మికులు, ఉద్యోగులు సామాజిక భద్రతా కవరేజ్ పొందుతారు. పీఎఫ్​, ఈఎస్​ఐ, బీమా మరియు ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు (social security benefits) లభిస్తాయి. అన్ని రంగాల కార్మికులకు చట్టబద్ధమైన సరైన కనీస వేతన చెల్లింపు అందించాలని చట్టాల్లో పేర్కొన్నారు. సకాలంలో చెల్లింపు ఆర్థిక భద్రతను నిర్ధారిస్తాయి. ఆయా కంపెనీల్లో తమ దగ్గర పని చేస్తున్న 40 ఏళ్లు పైబడిన అన్ని కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీని (Free annual health check-up) అందించాలి. ప్రైవేట్​ సెక్టార్​లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో వేతనాలు జమ చేయాలి.

మహిళలు రాత్రిపూట, అన్ని రకాల పనులలో పని చేయడానికి అనుమతించాలి. అధిక ఆదాయాన్ని సంపాదించడానికి మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం గ్రాట్యుటీ అమలు చేస్తుండగా.. తాజాగా దానిని ఏడాదికి తగ్గించారు. కాంట్రాక్ట్​ కార్మికులకు సైతం శాశ్వత ఉద్యోగులతో సమానమైన సామాజిక భద్రత, చట్టపరమైన రక్షణను అందించాలి. అన్ని రంగాల్లో పని చేస్తున్న వారికి సెలవు సమయంలో సైతం వేతనాలు చెల్లించాలి.