ePaper
More
    HomeజాతీయంPakistani Spy | వీరంతా దేశ ద్రోహులే.. పాక్ తొత్తులుగా మారిన రాక్ష‌సులు

    Pakistani Spy | వీరంతా దేశ ద్రోహులే.. పాక్ తొత్తులుగా మారిన రాక్ష‌సులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Pakistani Spy | ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)తో పాకిస్తాన్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టిన భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు.. ఇప్పుడు న‌ట్టింట్లో న‌క్కిన దేశ ద్రోహుల ప‌ని ప‌డుతున్నాయి. ఇండియాలో ఉంటూ, ఇక్క‌డి తిండి తింటూ శ‌త్రు దేశం కోసం ప‌ని చేస్తున్న కాల నాగుల‌ను క‌థ తేల్చే ప‌నిలో ప‌డ్డాయి.

    గూఢచర్య కార్యకలాపాలకు పాల్ప‌డుతున్న వారి ఆట క‌ట్టిస్తున్నాయి. పాకిస్తాన్ (Pakistan) తరపున గూఢచర్యం చేస్తున్న ఎనిమిది మందిని ఇప్ప‌టికే అరెస్టు చేశారు. ఇందులో నలుగురు హర్యానాకు చెందిన వారు కాగా, ముగ్గురు పంజాబ్‌, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. సున్నిత స‌మాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న ఆ ఎనిమిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. భార‌తీయుల‌ను సొంత దేశంపైకి ఎగ‌దోసేలా పాకిస్తాన్ కుట్ర‌లు ప‌న్నింది. అందులో భాగంగానే సోష‌ల్ ఇన్‌ఫ్లెయెర్స్‌పై పాక్ ఐఎస్ఐ దృష్టి పెట్టింది. యూట్య‌బ్ వ్లాగ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా(YouTube vlogger Jyoti Malhotra) ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణగా తెలుస్తోంది.

    Pakistani Spy | జ్యోతి మల్హోత్రా

    ‘ట్రావెల్ విత్ JO’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా vloger Jyothi Malhotra హర్యానాలోని హిసార్ వాసి. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నందుకు ఆమెను గత వారం అరెస్టు చేశారు. 33 ఏళ్ల జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో నేరుగా సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు గుర్తించారు. అలాగే, రెండుసార్లు పాకిస్తాన్‌ను సందర్శించిందని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా అధికారులు ఆమెను భారతదేశంలో తమ అసెట్‌గా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గూఢ‌చ‌ర్య ఆరోప‌ణ‌ల‌తో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. జ్యోతి నుంచి కీల‌క స‌మాచారం సేకరించిన‌ట్లు తెలిసింది.

    Pakistani Spy | దేవేందర్ సింగ్

    25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్(Devendra Singh Dhillon), పాటియాలాలోని ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ విద్యార్థి. మే 12న, ఫేస్‌బుక్‌లో పిస్టల్, తుపాకుల ఫోటోలను అప్‌లోడ్ చేసినందుకు హర్యానాలోని కైతాల్‌లో అతన్ని అరెస్టు చేశారు. గత నవంబర్‌లో అతను పాకిస్తాన్‌ను సందర్శించాడని గుర్తించారు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడని విచారణలో బయటపడింది.

    Pakistani Spy | నౌమాన్ ఇలాహి

    హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే 24 ఏళ్ల నౌమాన్ ఇలాహి(Nauman Elahi)ని కొన్ని రోజుల క్రితం పానిపట్ లో అరెస్టు చేశారు. అతను పాకిస్తాన్‌లోని ISI హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇస్లామాబాద్‌కు సమాచారం ఇవ్వ‌డానికి తన బావమరిది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుంచి డబ్బును స్వీకరించాడ‌ని విచార‌ణ‌లో వెలుగు చూసింది.

    Pakistani Spy | అర్మాన్

    ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా మే 16న హర్యానాలోని నుహ్‌లో అర్మాన్(Arman) (23)ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అతను పాకిస్తాన్‌కు సున్నితమైన సమాచారాన్ని తరలిస్తున్నట్లు నిఘా అధికారులు (Intelligence Officers) గుర్తించారు. ఈ మేర‌కు కీల‌క ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని, నిందితుడి నుంచి మరిన్ని వివ‌రాలు సేక‌రించేందుకు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

    Pakistani Spy | షాజాద్

    ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌(Shahzad)ను ఆదివారం మొరాదాబాద్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force) అరెస్టు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అతను పాక్ నిర్వాహకులకు అందజేశాడని ఎస్‌టీఎఫ్ తెలిపింది. అతను అనేకసార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన‌ట్లు గుర్తించారు. సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో సున్నిత‌మైన స‌మాచారాన్ని పాక్‌కు చేర‌వేశాడ‌ని పోలీసులు తెలిపారు.

    Pakistani Spy | మహ్మద్ ముర్తజా అలీ

    జలంధర్‌లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మొహమ్మద్ ముర్తజా అలీ(Mohammad Murtaza Ali)ని అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ(Pakistan ISI) కోసం గూఢచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాలు గుర్తించి స్థానిక పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. దీంతో అత‌న్ని అరెస్టు చేశారు. తాను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్(Mobile App) ద్వారా దేశానికి చెందిన కీల‌క స‌మాచారాన్ని ఐఎస్ఐకి చేర‌వేస్తున్న‌డాని గుర్తించారు. అతని వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. గజాలా, యామిన్ మొహమ్మద్‌ను ఇలాంటి గూఢ‌చ‌ర్య ఆరోపణలపై పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

    Pakistani Spy | ఇంటి దొంగ‌లు..

    ఇండియా(India)లో పుట్టి, పెరిగి పాకిస్తాన్ కోసం ప‌ని చేస్తున్న స్వదేశీ దొంగ‌ల‌ను గుర్తించ‌డంలో నిఘా వ‌ర్గాలు నిమ‌గ్న‌మ‌య్యాయి. ఇలాంటి వారి కోసం ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత మ‌రింత తీవ్ర శోధ‌న ప్రారంభ‌మైంది. యూట్యూబ‌ర్ ముసుగులో, వ్యాపారి ముసుగులో పాకిస్తాన్‌కు వెళ్తూ సున్నిత స‌మాచారాన్ని చేర‌వేస్తున్న వారిని క‌ట‌క‌టాల్లోకి పంపేందుకు నిఘా వ‌ర్గాలు(Intelligence agencies), భ‌ద్ర‌తా ద‌ళాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...