అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈసారి జట్టు ఎంపికలో అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు, యువ క్రికెటర్లకు కూడా అవకాశం కల్పించడం గమనార్హం. టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా మిగిలిన జట్లకు పోటీగా నిలవగల సామర్థ్యం గల బలమైన జట్టుతో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో జట్టుకు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) నేతృత్వం వహించనున్నాడు. ఇటీవల టీ20ల్లో భారత జట్టుకు (Team India) నాయకత్వం వహిస్తున్న ఆయన, తన దూకుడు మరియు వినూత్న శైలితో టీంను ముందుండి నడిపించే అవకాశం ఉంది.
Team India | ఏం చేస్తారో మరి..
మరోవైపు యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ (Shubhman Gill) జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను ఈసారి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. మరోవైపు ప్రధాన జట్టుతో పాటు, బీసీసీఐ (BCCI) ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. వీరు ఇప్పటి వరకు ఆసియా కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్లు టోర్నీలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు ఆడకపోయినా, అవసరమైతే ప్రధాన జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్టాండ్‌బై జాబితాలో ఉన్న వారి వివరాలు చూస్తే..
ప్రసిద్ధ్ కృష్ణ – వేగమైన బౌలింగ్‌తో బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయగల ఫాస్ట్ బౌలర్
వాషింగ్టన్ సుందర్ – ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లో సమర్థుడైన ఆల్‌రౌండర్
రియాన్ పరాగ్ – మధ్యలో వేగంగా పరుగులు సాధించగల యువ బ్యాట్స్‌మెన్
యశస్వి జైస్వాల్ – పవర్‌ప్లేలో ప్రత్యర్థులను దెబ్బతీసే డైనమిక్ ఓపెనర్
ధ్రువ్ జురెల్ – వికెట్‌కీపింగ్‌తో పాటు నిలకడ బ్యాటింగ్‌తో చక్కటి ప్రతిభ కనబరిచే బ్యాట్స్‌మెన్
ఈ ఐదుగురు ఆటగాళ్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోకపోయినా, ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పుడు జట్టులోకి వచ్చే అవకాశముంది. మొత్తానికి BCCI ప్రకటించిన ఈ జట్టు అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లతో ఆసియా కప్‌కు (Asia Cup) సిద్ధమవుతోంది. స్టాండ్‌బై ఆటగాళ్ల ఎంపిక కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంది. వారు అవసరమైతే టీమ్‌కు గేమ్ ఛేంజర్లుగా నిలిచే అవకాశం ఉంది. టీమ్ ఇండియాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడాల్సిందల్లా ఈ జట్టు టోర్నమెంట్ ఎలా రాణిస్తుందన్నది.
2025 ఆసియా కప్ టీం ఇండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.