ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | ఇది ట్రంప్ నిజ స్వ‌రూపం.. భార‌త్ లో ఆపిల్ త‌యారీని విస్త‌రిస్తాం..

    Donald Trump | ఇది ట్రంప్ నిజ స్వ‌రూపం.. భార‌త్ లో ఆపిల్ త‌యారీని విస్త‌రిస్తాం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | భారత్‌లో ఐఫోన్ల తయారీని విస్తరించాలని దిగ్గజ యాపిల్ సంస్థ (apple company) భావించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రణాళికలకు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (america president donald trump) అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో (apple CEO tim cook) స్వయంగా మాట్లాడి, భారత్‌కు తయారీ ప్లాంట్లను తరలించవద్దని అన్న‌ట్టు స‌మాచారం. ఈ పరిణామం మేకిన్ ఇండియా ఇనిషియేటివ్‌కు (make in india initiative) భారీ ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కి ట్రంప్ సూచిస్తూ, “భారత్ (india) తన ప్రయోజనాలను తానే చూసుకోవాలి” అన్నారు. భారత్, అమెరికా వస్తువులపై టారిఫ్ (tarrif) వసూలు చేయబోమని చెప్పిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన యాపిల్ భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్న సమయంలో రావడం గమనార్హం.

    Donald Trump | త‌గ్గేదే లే..

    డోనాల్డ్ ట్రంప్ (donald trump) దోహాలో చేసిన ప్రకటనలో, భారత్‌లో ఐఫోన్‌లను (I phones) తయారు చేస్తున్నందుకు యాపిల్ సంస్థపై (apple company) ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. టిమ్ కుక్‌తో మాట్లాడాను. నేను అతనితో, ‘టిమ్, మేము మీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం. మీరు $500 బిలియన్ల కంపెనీ (500 billion company) నిర్మిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు భారత్‌లో (India) ఫ్యాక్టరీలు పెడుతున్నారని వినిపిస్తోంది. నాకు అది నచ్చడం లేదు. మీరు భారత్‌కు సహాయం చేయాలనుకుంటే ఓకే. కానీ భారత్ ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు (highest tarrifs) వసూలు చేసే దేశాల్లో ఒకటి. అక్కడ అమ్మకం చేయడం చాలా కష్టమే. అయితే భారత్ మన వస్తువులపై టారిఫ్ వేయబోమని ఒప్పందం చేసుకుంది అని చెప్పారు.

    చైనా (china) కంటే భారతదేశంలో ఐఫోన్ల (I phones) తయారీ 5 నుండి 8 శాతం ఎక్కువ ఖరీదుతో కూడుకున్నదని రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ఇది 10 శాతం వరకు ఖరీదైనదిగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడి (america president) సుంకాన్ని నివారించడానికి ఆపిల్ ఇప్పటికే భారతదేశంలో తన ఉత్పత్తిని పెంచింది. భారత్‌లో యాపిల్ తయారీ ప్రణాళికలపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడం, జీరో టారిఫ్‌ల (zero tarrif) ఆఫర్ వంటి అంశాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న‌ట్టుగా ముచ్చ‌టించుకున్నారు. అయితే యాపిల్ సంస్థ (apple company) తన నిర్ణయాన్ని మార్చుకోవ‌డం లేద‌ని భార‌త్ లో ఐఫోన్స్ త‌యారీని విస్త‌రించ‌బోతుంద‌ని స‌మాచారం.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...