అక్షరటుడే, న్యూఢిల్లీ: GST slabs | వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ (Prime Minister Modi) GST పై ప్రకటన చేశారు.
ఈ క్రమంలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే ఉండబోతున్నాయి. ఈ మేరకు బుధవారం (సెప్టెంబరు 3) జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు.
ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల్లో 12, 28 స్లాబులు తొలగిపోనున్నాయి. ఇక 5, 18 స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. ఇందులో స్టాండర్డ్, మెరిట్ స్లాబులు మాత్రమే ఉంటాయి.
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు స్లాబుల విధానం ఈ నెల (సెప్టెంబరు) 22 నుంచి అమల్లోకి రాబోతోంది. తద్వారా వినియోగదారులకు భారీగా పన్నుల భారం తగ్గనుందని చెబుతున్నారు.
ఎంపిక చేసిన వస్తువులకు ప్రత్యేక రేట్లతో పాటు రెండు-శ్లాబ్ GST రేటు నిర్ణయాన్ని కౌన్సిల్ ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని పేర్కొంది.
GST slabs | మోడీ బొనాంజా
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ (Prime Minister Modi) GST పై ప్రకటన చేశారు.
సంస్కరణలు పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రకటించారు.
దీపావళి నాటికి ఈ సంస్కరణలు అమలులోకి వస్తాయన్నారు. పన్ను సంస్కరణల వల్ల సామాన్యులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందన్నారు. కాగా, దీపావళికి కాకుండా.. దసరాకు ముందే కొత్త స్లాబుల విధానం తీసుకొస్తున్నారు.