అక్షరటుడే, ఇందల్వాయి : Power Cut | ఇందల్వాయి మండలం సిర్నాపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ కోత విధించనున్నారు. సమ్మర్ యాక్షన్ (Summer Action) ప్లాన్‌లో భాగంగా సిర్నాపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డివిజినల్ ఇంజినీర్ సీహెచ్ హరిచంద్ర (CH Harichandra)పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Power Cut | వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని..
రానున్న రోజుల్లో అధిక లోడ్‌ను అధిగమించడానికి 5 ఎంవీఏ కెపాసిటీ పవర్ ట్రాన్ఫార్మర్-2 స్థానంలో 8 ఎంవీఏ కెపాసిటీ ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ను (Power Transformer) బిగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా (Power Supply) నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సిర్నాపల్లి, నల్లవెల్లి, డోన్కల్ గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.