అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కి, హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో ఉండేది తక్కువ.. ఢిల్లీ(Delhi)లో ఉండేది ఎక్కువ అని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లోని కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో కవిత పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉండేది తక్కువని.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారన్నారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు.
MLC Kavitha | హామీల అమలేది?
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన హామీల అమలు ఏమైందని కవిత ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. చదువుకునే విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు ఎటు పోయాయని ప్రశ్నించారు.
ఆడపిల్ల పెళ్లికి లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని.. ఈ 18 నెలలలో ఎక్కడైనా ఇచ్చారా; అని నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ (Runamafi) చేయకుండా, కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మహిళలందరికీ ఇస్తామన్న రూ.2,500 పింఛన్ ఎటు పోయిందని ప్రశ్నించారు.
MLC Kavitha | పాలనలో విఫలం..
రేవంత్‌రెడ్డి పాలనలో విఫలమయ్యారని కవిత ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకాక ఇతరులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ విమర్శించారు.
ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారని అని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar)లో అంబులెన్సులలో కనీసం డీజిల్ పోసే పరిస్థితి లేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు.
రేషన్ షాప్‌ల్లో ఇస్తున్న సన్న బియ్యంలో 50 శాతం దొడ్డు బియ్యమే అని నిరూపిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఫ్రీ బస్సు పేరున గ్రామాలకు వెళ్లే బస్సుల సంఖ్యను తగ్గించారన్నారు. ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం కాదని.. వెంటపడి పని చేయించుకోవాల్సి వస్తోందన్నారు.